Husband Killed His Wife: భార్య పై అనుమానం.. తల నరికేసిన భర్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Killed His Wife: జీవితాంతం ఆదుకుంటానని ఆ వ్యక్తి అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశాడు. తన కష్టాలు, సంతోషాల్లో పాలు పంచుకుంటానని భార్య నమ్మింది. వివాహం తరువాత, వారి వివాహం చాలా అన్యోన్యంగాసాగింది. ఈ జంట తమ ప్రేమకు చిహ్నంగా ఒక బిడ్డను కూడా కలిగి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ… భర్త ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్యపై అతి కిరాతకానికి పాల్పడ్డాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్‌లో చోటుచేసుకుంది.
Read also: Merugu Nagarjuna: ఎల్లుండి అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ఆయన ఆలోచనలు భారతావనికి దిక్సూచి
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ కాలనీలో వినయ్-పుష్పలత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. చాలా ఆనందంగా గడిపిన వీరి జీవితంలో ప్రేమకు ప్రతిరూపంగా ఒక బిడ్డకూడ కలిగింది. ఆతరువాత ఏం జరిగిందో ఏమోగానీ.. వీరి జీవితంలో కలతలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. ఆమెపై అనుమానం కారణంగా రోజూ గొడవలు జరిగేవి. అయితే ఒకరోజుతో ఆగలేదు.. గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతూనే వున్నాయి. ఆమెపై అనుమానం ఇంకాస్త పెరగడంతో వినయ్ సహించలేకపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ వేశాడు. రోజూలేగే నిన్న ఇంటికి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగాడు. మాట మాట పెరింగింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన వినయ్ భార్య పుష్పలతను తల నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు.
Read also: Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
గట్టిగా కేకలు వినిపించడంతో.. స్థానికులు వచ్చి చూడగా మృతదేహం పక్కనే తల నరికి పెట్టి అక్కడే కూర్చన్న వినయ్ ను చూసి స్థానికులు షాక్ తిన్నారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి నిందితుడు వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడు ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్య నిజంగానే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందా? మరి ఆ వ్యక్తి ఎవరు? లేక భర్త అనుమానం నిజమైనది కాదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Shamshabad: పొగమంచు ఎఫెక్ట్.. విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన..
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..