Krishna Bridge: నారాయనపేట జిల్లా కృష్ణా మండల రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణా వంతెనపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. కృష్ణా వంతెన మీదుగా వెళ్లే జాతీయ రహదారి-167ను మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఇవాల్టి (జనవరి 17వ) ఉదయం 5 గంటల నుంచి 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ రాయచూర్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు ఆంక్షలు పాటించాలని కోరారు. ఎన్‌హెచ్-167పై వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. రాయచూర్ వెళ్లే వారు మరికల్ సబ్ స్టేషన్ నుంచి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యామ్, గద్వాల్ మీదుగా కేటీదొడ్డి రాయిచూర్ మీదుగా మళ్లించారు. వాహనదారుల అవగాహన కోసం కృష్ణా, మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు.
Read also: Kishan Reddy: బషీర్ బాగ్ ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమం.. పాల్గొన్న కిషన్ రెడ్డి
పాత రోడ్డు ఉన్నప్పుడే బాగుండేదని కొత్త సీసీ రోడ్డు వేసినప్పటి నుంచి ఈ సమస్య ఎక్కువైందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పుడు 45 రోజుల పాటు బ్రిడ్జిపై వాహనాలు నిలిపివేసి మళ్లీ మునుపటిలా మరమ్మతులు చేసినా ప్రయోజనం ఉండదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు నాణ్యమైన రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు. రాయచూరు-హైదరాబాద్ మధ్య రద్దీ పెరగడంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. వంతెన వెడల్పు 20 అడుగుల వెడల్పు మాత్రమే ఉండడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వంతెనకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్త వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read also: Ayodhya Ram Mandhir: హైదరాబాద్ నుంచి అయోధ్యకు.. 1,265 కిలోల భారీ లడ్డు..
గతంలో మరమ్మతులు..
దశాబ్దాల నాటి కృష్ణా వంతెనను కర్ణాటక ప్రభుత్వం 2016లో మరమ్మతులు చేసింది. వంతెనపై ధ్వంసమైన రోడ్డు స్థానంలో కొత్త సీసీ రోడ్డును నిర్మించారు. అయితే సీసీ రోడ్డు ప్రయాణికులకు నిరుపయోగంగా మారింది. ప్రతి రోజూ రాత్రి వేళల్లో సీసీ రోడ్డు బేరింగ్‌లు ఎక్కడపడితే అక్కడ నిలబడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అడుగడుగునా గుంతలు ఉండడంతో ఈ వంతెనపై ఎక్కడికక్కడ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బ్రిడ్జిపై ఉన్న గుంతలో వాహనాలు ఇరుక్కుపోతే మిగతా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో అటు కర్ణాటక పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులకు ట్రాఫిక్ క్లియర్ చేయడం నిత్యం తలనొప్పిగా మారుతోంది. సమస్య తీరుపై అధికారులకు విన్నవించగా.. అధికారులు స్పందించి గతేడాది ఫిబ్రవరిలో మళ్లీ మరమ్మతులు చేశారు. అయితే మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.
Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!