Psycho Husband: సమాజంలో భార్య భర్తల బంధం ఏమో గానీ.. సైకోయిజం, షాడిజం వంటి లక్షణాలు ప్రజల్లో విస్తరిస్తున్నాయి. ప్రేమ అప్యాయత వంటి మాటలు కరువవుతున్నాయి. మనుషులపై అనురాగం ఏమో గానీ.. చాలా క్రూరంగా ఆలోచించడమే కాదు.. అదే స్థాయిలో నేరాలు కూడా చేస్తున్నారు. కొందరు మద్యానికి బానిసలు కాగా మరికొందరు క్షణికావేశంలో కిరాతకంగా మారిన సంఘటనలు అనేకం. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి, కరెంటు షాక్ ఇచ్చి, చీరతో ఉరివేసి, భార్యను హత్య చేశాడు.
Read also: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో బాలికపై పాడుపని.. నిందితుడి అరెస్ట్..
స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు శివారు కాశీగూడెంలో కాసిం, మదారిబీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె హజరత్‌ను తొర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన గాంధారి, ఫాతిమాబీ దంపతుల కుమారుడు అమీర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరు జీవనోపాధి కోసం రంగరాయగూడెం గ్రామ శివారులోని కాశీంనగర్‌కు వచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ముందు అన్యోన్యంగా సాగిన జీవితంలో మద్యం చిచ్చు పెట్టింది. అమీర్ రాను రాను మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు మెదలయ్యాయి. ఇంటికి రోజూ మద్యం తాగిరావడమే కాకుండా.. భార్య హజరత్‌ను నిత్యం భార్యను కొట్టి వేధించేవాడు. భర్త సైకోయిజాన్ని భరించలేని భార్య బంధువులు, కుటుంబ సభ్యులకు అమీర్ గురించి చెప్పింది. దీంతో పెద్దలందరూ కలిసి అమీర్‌ను పలుమార్లు మందలించినా ఫలితం లేకపోయింది. తనపై బంధువులు, కుటుంబ సభ్యులకు చెప్పి పరువు తీసిందని సైకోగా మారాడు అమీర్. భార్య హజరత్ ను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మళ్లీ మద్యం సేవించిన అమీర్.. మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా..కర్రతో కొట్టాడు.. ఆమెను చీరతో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో చీరతో ఉరివేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పిల్లలను తీసుకుని తెల్లవారుజామున ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అమీర్ ను చూసి పిల్లలను ఎక్కడకు తీసుకుని వెళుతున్నావ్ భార్య ఏమైంది అని అడిగినా సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జారుకోవడానికి చూసాడు. అమీర్ పై అనుమానం రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య ఏమైందంటూ ప్రశ్నించగా చివరకు నోరువిప్పి తనే చంపేసి పిల్లలతో పారిపోతున్నానని చెప్పాడా. దీంతో షాక్ తిన్న పోలీసులు అమీర్ ఇంటికి వెళ్లి చూడాగా హజరత్ విగతజీవిగా పడివుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
South Africa: జోహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 52 మంది మృతి..