Shamshabad: శంషాబాద్‌లో విషాదం.. సెప్టిక్ ట్యాంకులో పడి ఏడేళ్ల చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలసి ఓ వివాహానికి హాజరైన బాలుడు ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read also: Kushitha Kallapu: ఆరంజ్ కలర్ సారీ తో పడేస్తున్న కుషిత కళ్లపు
Also Read
నందిగ్రామ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి తన భార్య మౌనిక, సోదరుడు, తల్లితో కలిసి వివాహానికి హాజరయ్యారు. తమతో పాటు ఐదేళ్ల కుమారుడు అభిజిత్‌రెడ్డిని కూడా తీసుకొచ్చారు. అయితే సాయంత్రం పెళ్లి బరాత్ వేడుక జరిగింది. ఇందులో సంగీత అభిజిత్ రెడ్డి డ్యాన్స్ చేశారు. అయితే నాలుగు గంటల తర్వాత బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అందరూ సమీప ప్రాంతాలకు చేరుకున్నారు. 6 గంటల తర్వాత కూడా బాలుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆర్జీఐ పోలీసులను ఆశ్రయించి బాలుడు కనిపించడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఫంక్షన్ హాల్ వెనుక సంపు దగ్గర అభిజిత్ రెడ్డి చెప్పులు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే సంపు వద్దకు ప్రజలను పంపి సోదాలు చేశారు. అందులో బాలుడు ఛిద్రంగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతికి ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Tirumala: తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..