Psycho Husband: సమాజంలో భార్య భర్తల బంధం ఏమో గానీ.. సైకోయిజం, షాడిజం వంటి లక్షణాలు ప్రజల్లో విస్తరిస్తున్నాయి. ప్రేమ అప్యాయత వంటి మాటలు కరువవుతున్నాయి.
కట్టుకున్న భార్యకు అన్నీ తానై చూసుకోవాల్సిన భర్త సైకో ప్రవర్తనతో.. ఓ ఇల్లాలికి నరకం చూపించాడు.. పెళ్లి జరిగినప్పటి నుంచి వికృత వేధింపులకు పాల్పడ్డాడు.. మౌనంగా దాదాపు రెండేళ్లు ఆ సైకోగాడిని భరించిన ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన పోలయ్య 2020 మార్చి 5వ తేదీన వివాహం చేసుకున్నాడు.. ఇక, కొంతకాలం నుంచి తీవ్ర వేధింపులకు దిగాడు.. ఓ వైపు అనుమానం, వికృత వేధింపులు.…