Siddipet Crime: ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం అయిపోయాయి. గొడవలు వచ్చినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించుకుని జీవితాన్ని గడపాల్సింది పోయి ఈగోలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చిన్న చిన్న సమస్యలకే భార్య భర్తల మధ్య అగాధం పెరిగిపోతుంది. వాటి ప్రభావం పిల్లలపై పడుతుంది. గోరింత కలహాలు కొండంతగా కనిపించడంతో దాడులు చేసుకుంటూ కుటుంబాలకు దూరమవుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే రోజులు వచ్చాయి. కుటుంబ కలహాలతో భర్త భర్యను హత్య చేసి పరారైన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది.
Read also: CM Jagan : ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కనకరాజు, భవాని నివాసం ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆనందంగా సాగిన వీరి కుటుంబంలో రాను రాను కలహాలు మొదలయ్యాయి. చిన్న చిన్న గొడవల కారణంగా గ్రామ పంచాయితీ వరకు వెళ్లారు. దీంతో గ్రామంలోని వారు ఇద్దరికి నచ్చజెప్పి ఇంటికి పంపారు. అయినా భర్తలో మార్పు రాలేదు. దీంతో ఉదయం భార్య భర్తల మధ్య గొడవకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి లోనైన భర్త అక్కడే వున్న తలగడను ఆమె ముఖం పెట్టాడు. దీంతో ఆమె ఊపిరి ఆడక తల్లడిల్లింది. అయినా భర్త కనికరం చూపలేదు. దిండును గట్టిగా పట్టుకోవడంతో ఆమెకు ఊపిరి ఆడకుండా అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతి చెందడంతో భయంతో అక్కడి నుంచి భర్త కనకరాజు పరారయ్యాడు. బయట ఎవరూ గమనించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పక్కనే వున్న స్థానికులు భవాని ఎంతకు బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ కు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భవాని మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే కనకరాజు, తన భార్య భవానిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న కనకరాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!