ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
- ORR ఆర్బిట్రేషన్ కేసులో HMDA పిటిషన్ డిస్మిస్
- హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
- న్యాయమూర్తి తప్పుకోవాలన్న విజ్ఞప్తి తిరస్కరణ
- ఆర్బిట్రేషన్ ప్రక్రియకు మరో నాలుగు వారాల గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఆర్బిట్రేషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం డిస్మిస్ చేసింది. విచారణ జరిపిన జస్టిస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు స్పష్టంగా నిరాకరించింది.
న్యాయమూర్తి తప్పుకోవాలన్న విజ్ఞప్తి తిరస్కరణ
విచారణ సందర్భంగా న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకోవాలంటూ హెచ్ఎండీఏ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించినంత మాత్రాన, కేసులో పక్షపాతం ఆపాదించడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి అభియోగాలు లేదా ఆరోపణలు లేనప్పుడు, ఇక పక్షపాతానికి తావెక్కడ ఉంటుందని హెచ్ఎండీఏను ధర్మాసనం ప్రశ్నించింది.
Also Read
ఆర్బిట్రేషన్ ప్రక్రియకు మరో 4 వారాల గడువు
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హెచ్ఎండీఏ పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. కేసు ముందుకు సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్బిట్రేటర్ నియామకంతో పాటు వారికి చెల్లించాల్సిన ఫీజుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేందుకుగాను హెచ్ఎండీఏకి మరో నాలుగు వారాల సమయాన్ని కేటాయిస్తూ విచారణను ముగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఓఆర్ఆర్ ఆర్బిట్రేషన్ వ్యవహారంలో హెచ్ఎండీఏకి చట్టపరమైన ఊరట లభించకపోగా, ఆర్బిట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!