Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- సీజేపీ నిరసనలపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్..
- విద్యార్థుల పేరుతో అచకాలకు పాల్పడుతున్నారు..
- రాహుల్ గాంధీ అధికార దాహంతో ప్రజాతీర్పు అవమానిస్తున్నారు..
- బంగ్లాదేశ్ స్పూర్తి, అధికార మార్పు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP), కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విద్యార్థులు, జాతీయ ప్రయోజనాలతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశంలో అరాచకాన్ని సృష్టించి, రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నంగా మారాయని ఆయన ఆరోపించారు. ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని మార్చాలని, బంగ్లాదేశ్ ఉద్యమం మాకు స్పూర్తి బహిరంగంగా మాట్లాడటం వెనక వారి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. విద్యార్థుల ముసుగులో దేశంలో అరాచకాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌లో అధికార మార్పు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని వారు గుర్తించాలని హితవు పలికారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ప్రజాతీర్పును పదే పదే అగౌరపరుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవకపోతే ప్రజాస్వామ్య సంస్థలపై అపనమ్మకం కలిగించే ప్రయత్నాలను కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని నిరంతరం ఇబ్బందులకు గురిచేయడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు. అధికార దాహాంతో రాజ్యాంగ సంస్థల్ని అవమానిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల రాహుల్ గాంధీ వైఖరి అత్యంత సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!