Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand: ఒక్క విజయం దక్కితే అరడజను పరాజయాలు పలకరించడం మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో ఒక అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సీటీమార్’ తర్వాత సరైన విజయం లేక, గతంలో వచ్చిన ‘భీమా’, ‘విశ్వం’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే రొటీన్ కథలను పక్కనపెట్టి, దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని వైవిధ్యమైన స్క్రిప్టులతో రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. అయితే సినిమాలు శరవేగంగా ముస్తాబవుతున్నా, థియేటర్లలోకి ఎప్పుడు వస్తాయనే విషయంపై మాత్రం మేకర్స్ పెదవి విప్పకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్‌ను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ‘ఘాజీ’ వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ ‘భరతవర్ష’ అనే భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏడవ శతాబ్దం నాటి చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన టైటిల్ గ్లింప్స్, ఆ తర్వాత మూడు నెలల కిందట విడుదలైన తొలి పాట సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. తాజాగా దసరా సందర్భంగా ‘అమ్మ కదలి వచ్చే’ అంటూ సాగే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటతోనైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది.
ఇక గోపీచంద్ కెరీర్లో 34వ చిత్రంగా తెరకెక్కుతున్న మరో సినిమా ‘సింగ’. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాలుగు నెలల కిందట రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ చూస్తే ఇదొక ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని స్పష్టమైంది. కానీ ఆ గ్లింప్స్ తర్వాత చిత్ర యూనిట్ నుంచి కనీస బజ్ కూడా లేకుండా పోయింది. ఈ చిత్రం ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఆ యూనిట్‌కే తెలియని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా థియేటర్లలో గోపీచంద్ కటౌట్ కనిపించక ఆయన అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, రిలీజ్ తేదీల విషయంలో ఇలా దాగుడుమూతలు ఆడటం మ్యాచో స్టార్ మార్కెట్‌ను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ ఏడాదైనా గోపీచంద్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తారా లేక ఈ ఎదురుచూపులు మరింత కాలం సాగుతాయా అనేది చూడాలి.
Also Read
- Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
- Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
- Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న 'ఈ నగరానికి ఏమైంది' కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
- Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!