Narayanpet: ఫుట్ పాయిజన్ తో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన ఘటన మరువక ముందే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మాగనూర్ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టు ఇవాళ విచారించింది. దీనిపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని తెలిపారు. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇది చాలా సీరియస్ అంశమని సీజే తెలిపారు.
పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సంఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకుని సీజే ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అని ప్రశ్నించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని తెలిపింది. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా అని తెలిపింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏఏజీ అందిస్తామన్నారు.
Read also: V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
నారాయణపేట జిల్లా మాగనూరులో ఫుట్ పాయిజన్‌కు గురైన 20 మంది విద్యార్థులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహబూబ్ నగర్ ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బయట చిరుతిల్లు తిండి తినడం వల్లనే నని ఫుట్‌పాయిజన్ అయ్యిందని మాఘనూరు అధికారుల అంటున్నారు. కాగా.. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ ఉడకని అన్నం, వంకాయ ఆలుగడ్డ పెట్టారని చెబుతున్నారు. వారు తాగిన నీరు కూడా సరిగా లేదని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఎవరూ బయట చిరుతిల్లు తినలేదని అంటున్నారు.
మేమందరం పాఠశాల భోజనం తినండం వల్లే అస్వస్థలకు గురయ్యామని అన్నారు. మరోవైపు మాగనూరు వైద్యం పొందుతున్న విద్యార్థులను కలిసేందుకు వెళుతున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్కూల్ వద్ద పోలీలసు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మాగనూరు గ్రామాన్ని పోలీసులు దిగ్బంధంలో తీసుకున్నారు. ఎవరికిని మాగనూరులోకి అనుమతించడం లేదు. మాగనూరు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సిక్త పట్నాయక్ సందర్శించారు. వంట గది, కూరగాయలు, వంట సామాగ్రి పరిశీలించారు. వంట చేస్తున్న సిబ్బందితో వివరాలు సేకరించారు.
Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..