Medaram Helicopter Services: హెలికాప్టర్ పై మేడారం టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మహాజాతర మేడారం ప్రారంభం అయింది. మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్నారు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు. ఈ రోజునుంచి 19 వరకూ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్ళాలనుకునేవారికి అద్భుతమయిన అవకాశం లభించింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్‌రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. జాయ్‌రైడ్ ద్వారా గగన విహారం చేస్తూ మేడారం జాతర ను ఎంచక్కా ఆకాశం నుంచి చూడవచ్చు. సుమారు 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ అవకాశం ఉంటుంది. హనుమకొండ -మేడారం వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు షటిల్ సర్వీస్‌లు వున్నాయి.
షటిల్ సర్వీస్‌తో.. 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోవచ్చు. కరీంనగర్ -మేడారం, హైదరాబాద్-మేడారం, మహబూబ్‌నగర్-మేడారం రూట్లలో చార్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 5 సీట్స్ ఉంటాయి. హెలికాప్టర్ సేవలు వినియోగించుకునే భక్తులకు వీఐపీ దర్శనం అందిస్తారు.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
సర్వీసులు ఎలాగంటే..
జాయ్‌రైడ్ సర్వీస్ద్వారా మేడారంలో గగన విహారం వుంటుంది. 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం చేయవచ్చు. ఇందుకోసం రూ.3,700 ధర చెల్లించాలి.
షటిల్ సర్వీస్ హనుమకొండ -మేడారం వుంటుంది. కేవలం 20 నిమిషాల్లో జాతరకు వెళ్ళవచ్చు. అందుకోసం రూ.19,999 చెల్లించాలి.
చార్టర్ సర్వీస్ హైదరాబాద్-మేడారం అందుబాటులో వుంటుంది. ఇందులో 5 సీట్లుంటాయి. వీఐపీ దర్శనం అందుబాటులో వుంటుంది. ఇందుకోసం రూ.75,000 చెల్లించాలి.
కరీంనగర్ -మేడారం హెలికాప్టర్ సర్వీసు కావాలంటే రూ.75,000 చెల్లించాలి. మహబూబ్‌నగర్-మేడారం సర్వీస్ కోసం రూ 1,00,000 ధర చెల్లించాలి.

తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!