మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి సిద్ధమవుతున్న భక్తులకు పూజారుల సంఘం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ములుగు జిల్లాలోని ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రేపు (బుధవారం) ఒక రోజంతా అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మేడారంలో గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుండటంతో పాటు, భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గద్దెల విస్తరణ పనులను కూడా వేగవంతంగా చేపడుతున్నారు. ఈ అభివృద్ధి…
తెలంగాణ మహాజాతర మేడారం ప్రారంభం అయింది. మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్నారు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు. ఈ రోజునుంచి 19 వరకూ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్ళాలనుకునేవారికి అద్భుతమయిన అవకాశం లభించింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్‌రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు.…