Telangana Heavy Rain: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ 12 జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబబ్ నగర్, నాగర్ కర్నూల్ 7 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదు కావొచ్చని తెలిపింది. హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లోనూ మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇక ఏపీ ఈనెల 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69MM అధిక వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో 50 నుంచి 90% అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో ఏకంగా 90.4%, శ్రీకాకుళం జిల్లాలో 70%, విజయనగరంలో 62.2%, మన్యంలో 61.2%, ఏలూరులో 66.4%, గుంటూరులో 64.5%, పల్నాడులో 50.4% అధిక వానలు కురిశాయి. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలోని రిజర్వాయర్లలోకి నీరు సమృద్ధిగా చేరుతోంది.
శ్రీశైలం 2, నాగార్జున సాగర్ 8 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం 2 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీరు వదులుతున్నారు. దీంతో సాగర్కు 1,12,803 క్యూసెక్కుల ఇన్ఫ్రా వస్తోంది. సాగర్ 8 గేట్లు ఎత్తి 1,22,354 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది.
Read also: Munugode Bypoll: బంపరాఫర్స్.. ఫ్లైట్ టికెట్లు.. రూ70 కోట్ల మద్యం.. ఎక్కడో తెలుసా?
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, పరిసర ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఉండటంతో.. దీని ప్రభావం రాయలసీమ, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్ వెంబడి ద్రోణి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ఈ తుపాను ప్రభావంతో పశ్చిమ, ఉత్తర తెలంగాణలో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
భారీ వర్షాల హెచ్చరికల కారణంగా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
ఒడిశా- బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బుధవారం వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Left Parties Sabha: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్.. కామ్రేడ్స్ ఉమ్మడి సభ