Munugode Bypoll: ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. రాజకీయ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని, ఓటరును వదులుకునేందుకు సిద్ధపడట్లేదు. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓటుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు లేదా తులం బంగారం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లు పూర్తి కాకుండానే రూ.1,000-రూ.10,000 ఇస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
7 మండలాల్లో రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు
ఉపఎన్నిక సమీపిస్తుండటంతో మునుగోడులో నియోజకవర్గంలోని 7 మండలాల్లో 28 వైన్ షాపుల్లో ఈనెల 10 రోజుల్లోనే రూ.70.7 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఆదాయంలో సగం. ఇక SEPలో రూ.150.06 కోట్లు, AUGలో 126.7 కోట్ల ఆదాయం వచ్చింది. ఈనెల ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా అమ్మకాలు జరగ్గా ఉపఎన్నిక దగ్గరపడేకొద్దీ పార్టీలు ప్రచార జోరు పెంచితే మద్యం విక్రయాలు కూడా భారీగా పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఉపఎన్నికకు 2వేల మంది పోలీసులు
మునుగోడు ఉపఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడానికి 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేస్తున్నామని SEC వికాస్రాజ్ తెలిపారు. నియోజకవర్గంలో 2.34 లక్షల ఓటర్లున్నారని, 294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 7 మండలాల్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, 40కిపైగా లిక్కర్ షాపులను సీజ్ చేశామని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ ఉంటుందన్నారు అధికారులు.
Left Parties Sabha: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్.. కామ్రేడ్స్ ఉమ్మడి సభ