Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
సిక్కింలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య భీకర కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా, కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ లో మరోసారి భారీగా కురుస్తోంది వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్‌పేట్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్‌పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. రుతుపవనాల ప్రవేశంతో బుధవారం నాడు…