సిద్ధిపేట పట్టణ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తాగునీటి జలవలయాన్ని చేపడుతున్నామని మంత్రి హరీష్రావు తెలిపారు. తాగునీటి ఎత్తిపోతలకు దీంతో ఇబ్బందులు తప్పుతాయన్నారు. నాలుగు దశాబ్దాల ముందు చూపుతో..మున్సిపల్ శాఖ శాశ్వత తాగునీటి అభివృద్ధి కో సం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు.
సిద్ధిపేట రింగ్ మేన్ పైపులైన్ గ్రావిటీ ద్వారా పట్టణంలోని ప్రతీ కాలనీకి నీటిని తరలించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీకి రింగ్ మేన్ కనెక్టీవిటీ ద్వారా తాగునీరు అందించేలా రూపకల్పన చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.