Railway Services: సిద్దిపేటలో రైలు శబ్ధం వినిపిస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు నేడు సిద్దిపేటకు రాబోతోంది. సీఎం కేసీఆర్ దశాబ్దాల కల సాకారం కానుంది. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభిస్తారు. స్వరాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. ఇటీవలే సిద్దిపేట వరకు రైలు మార్గం నిర్మాణం పూర్తయింది. దాంతో నేటి నుంచి సిద్దిపేట-కాచిగూడకు రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేస్టేషన్ల మధ్య కొత్త రైలు మార్గాన్ని ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్ నగర్-కర్నూల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా విద్యుదీకరణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి బయలుదేరి గజ్వేల్, సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్లలోని రాజన్న సిరిసిల్లలోని వేములవాడ, బోయినిపల్లి మీదుగా కరీంనగర్ జిల్లా వెదిర మీదుగా కొత్తపల్లిలో కలుస్తుంది. ఈ రైలు మార్గం పొడవు 151.36 కి.మీ. రూ.1160.47 కోట్ల అంచనాలతో పనులు ప్రతిపాదించారు. రైల్వే లైన్ నిర్మాణానికి సుమారు 2,200 ఎకరాలు అవసరం కాగా, సిద్దిపేట జిల్లాలో భూసేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించి పనులు పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 954 ఎకరాల భూసేకరణకు గాను 808 ఎకరాల భూసేకరణ పూర్తయింది. నాలుగైదు దశల్లో రైల్వే లైన్‌కు అధికారులు ప్రణాళికలు రచించి పనులు చేపట్టారు. మెదక్ జిల్లాలో 9.30 కి.మీ, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీ, కరీంనగర్ జిల్లాలో 20.86 కి.మీ మొత్తం 151.36 కి.మీ రైల్వే లైన్ నిర్మించనున్నారు. నాలుగు జిల్లాల్లో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.
Hyderabad: హోంవర్క్ చేయలేదని పలకతో తలపై కొట్టిన టీచర్.. యూకేజీ చిన్నారి మృతి