Harish Rao : తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతారా.?
- బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీష్‌రావు
- తెలంగాణ ఏర్పాటు పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
- పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం -హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఒక విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను అవమానించడమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు.
PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
తెలంగాణ ఆవిర్భావం రాజ్యాంగబద్ధంగా జరిగిందని, నేడు ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని హరీష్ రావు విమర్శించారు. “ఇండియా-పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే, ఆనాడు బీజేపీ పార్లమెంట్‌లో విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని, నేడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం స్పందించి తన వైఖరిని స్పష్టం చేయాలని, లేదంటే ఇది ఆ పార్టీ అధికారిక ధోరణిగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..
రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండటం సిగ్గుచేటని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరుతో ఓట్లు అడిగి గెలిచిన వీరు, ఢిల్లీ పెద్దల ముందు వంగి రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. “బీఆర్ఎస్ ఎంపీలే లోక్‌సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవారు” అని పేర్కొన్న ఆయన, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అంటే ఒక పోరాట గాథ అని, స్వాభిమానానికి ప్రతీక అని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరని హెచ్చరించారు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తామని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
-
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!