Site icon NTV Telugu

Harish Rao Meets KCR: కేసీఆర్తో హరీష్ రావు సమావేశం.. బనకచర్ల ప్రాజక్టుపై చర్చ!

Kcr

Kcr

Harish Rao Meets KCR: హైదరాబాద్ లోని నందినగర్‌ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా సమావేశమయ్యారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చిన నేపథ్యంలో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ సర్కార్ ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును ఎజెండా నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బీఆర్ఎస్ పార్టీ అయితే బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు చేశారు.

Read Also: Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన గోల్డ్ ధరలు

ఇక, బనకచర్ల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కేసీఆర్, హరీష్ రావు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వ్యూహాలపై కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చ జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version