Harish Rao : హైదరాబాద్ లో పెద్దఎత్తున మైనింగ్ జరుగుతోంది..
- హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్.. హరీష్ రావు ఆరోపణలు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం..
- స్టోన్ క్రషర్లలో నిబంధనల ఉల్లంఘనలు
- తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారుల్లో, నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. శాసనసభలో మైనింగ్ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. మైనింగ్ శాఖ అనేది రాష్ట్రానికి పన్నేతర ఆదాయాన్ని (Non-Tax Revenue) సమకూర్చే అత్యంత కీలకమైన శాఖ అని, ఇక్కడ ప్రభుత్వం , అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అంత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ముఖ్యంగా స్టోన్ క్రషర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ (జీఓ నెంబర్ 26) నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, దీన్ని ఒక సద్విమర్శగా తీసుకుని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. తాను సేకరించిన అన్ని డాక్యుమెంట్లను మంత్రికి అందజేస్తానని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?