KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ శాసనసభ వేదికగా చెలరేగిన రాజకీయ ఉద్రిక్తతలు రాజ్‌భవన్ (లోక్ భవన్)కు చేరాయి. సభ ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ శాసనసభ్యులు చట్టసభలు, పోలీసుల తీరుపై గవర్నర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బుధవారం (సెప్టెంబర్ 9) మధ్యాహ్నం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలను వివరిస్తూ 13 పేజీల సమగ్ర ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు అందజేశారు.
అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ భవన్లో మాట్లాడారు. “రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. యూరియా కొరత, రైతు భీమాపై విషయాలను ప్రస్తావించాం. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై గవర్నర్‌కు కంప్లైంట్ ఇచ్చాం. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాం. బ్లాక్ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. మాపై దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్‌పై దాడి చేసేందుకు ఉసిగోల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్‌కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్‌ను అవమానిస్తున్నారు. శాసనసభ కాదు దుష్యాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడుతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్, డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.” అని కేటీఆర్ వివరించారు.
Also Read
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
తాజావార్తలు
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!