2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- Infinix Xpad 30 Pro టాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్..
- 11 అంగుళాల 2.5K డిస్ప్లే, 60Hz/90Hz రిఫ్రెష్ రేట్
- పనితీరు కోసం MediaTek Helio G200 Ultimate చిప్సెట్
- భారీ 8200mAh బ్యాటరీ, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Xpad 30 Pro: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి టాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. Infinix Xpad 30 Pro పేరుతో వచ్చిన ఈ టాబ్లెట్ 11 అంగుళాల 2.5K డిస్ప్లే, MediaTek Helio G200 Ultimate ప్రాసెసర్, 8200mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ టాబ్లెట్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.
ఈ Infinix Xpad 30 Proలో 11 అంగుళాల 2.5K డిస్ప్లేను అందించారు. ఇది 85% స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. డిస్ప్లే 60Hz, 90Hz రిఫ్రెష్ రేట్లను సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 550 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం Panda MN228 కవర్ గ్లాస్‌ను ఉపయోగించారు. TÜV Rheinland నుంచి Hardware-Level Low Blue Light, Flicker-Free సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
టాబ్లెట్ పనితీరు కోసం MediaTek Helio G200 Ultimate ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU ఉంది. గరిష్ఠంగా 8GB RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ వరకు లభిస్తుంది. వర్చువల్ RAM ద్వారా RAMను 16GB వరకు పెంచుకోవచ్చు. అలాగే microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఫొటోలు, వీడియోల కోసం వెనుక భాగంలో 8MP కెమెరాను అందించారు. ఇందులో f/2.0 అపెర్చర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా 8MP కెమెరా ఉంది. రెండు కెమెరాలతోనూ గరిష్ఠంగా 2K రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
Infinix Xpad 30 Proలో 8200mAh బ్యాటరీను అందించారు. దీనికి 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. టాబ్లెట్ కొలతలు 254.04 × 165.55 × 6.6 మిల్లీమీటర్లు కాగా, బరువు 476 గ్రాములు. కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్‌లో 4G, Wi-Fi, Bluetooth 5.3, GPS, USB Type-C వంటి ఆప్షన్లు ఉన్నాయి. DTS సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించారు. G-సెన్సార్, e-కంపాస్, ఏంబీఎంటీ లైట్ సెన్సార్, SAR సెన్సార్ వంటి సెన్సార్లు ఉన్నాయి. టాబ్లెట్‌తో పాటు X Pencil 20, X Keyboard 11 యాక్సెసరీలను కూడా బండిల్‌గా అందిస్తున్నారు. దీంతో నోట్ టేకింగ్, టైపింగ్ వంటి పనులకు టాబ్లెట్‌ను మరింత సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.
సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Infinix Xpad 30 Pro Android 16 ఆధారిత XOS 16.3పై పనిచేస్తుంది. టాబ్లెట్ ఆంత్రాసైట్ గ్రే, ట్విలైట్ పర్పుల్, టైటానియం సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర $196, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.18,000గా ఉంది. ఇది 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే భారత మార్కెట్లో ఈ టాబ్లెట్ ఎప్పుడు విడుదలవుతుంది, ఏ ధరలకు లభిస్తుంది అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!