Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Update on YS Jagan Padayatra 2.0: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో ‘పాదయాత్ర 2.0’పై జగన్ ప్రస్తావించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గతంలో జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రారంభమైన యాత్ర.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. దాదాపు 16 నెలల పాటు సాగిన ఈ పాదయాత్రలో జగన్ సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో పర్యటించారు. రోజుకు సగటున 12 నుంచి 20 కిలోమీటర్ల మేర నడుస్తూ వివిధ వర్గాల ప్రజలను కలిశారు. రైతులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, నిరుద్యోగ యువతతో పాటు వివిధ సామాజిక వర్గాల ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. యాత్రలో 500, 1,000, 2,000, 3,000 కిలోమీటర్ల మైలురాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తితో దాడి జరిగిన ఘటన కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన అనంతరం పాదయాత్రకు కొంతకాలం విరామం ఏర్పడింది.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల ఆధారంగా వైసీపీ ‘నవరత్నాలు’ హామీలను రూపొందించింది. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో 91 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. దీంతో జగన్ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సంకల్ప యాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు మరోసారి పాదయాత్రకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారన్న వార్త వైసీపీ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ‘పాదయాత్ర 2.0’ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
- Tags
- ap
- Padayatra
- Padayatra 2.0
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!