Harish Rao: కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అది గెలిచే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ అంటే కేసిఆర్ కు చాలా ఇష్టం, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువలి, విద్వంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీకి గెలవాలన్నారు. బీజేపీ బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించింది, 14 లక్షల కోట్లు మాపి చేసింది, పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదన్నారు. బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ, రైతుల ఉసురు పోసుకుందన్నారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా, పిల్లలు బ్రతుకుతారా? అని ప్రశ్నించారు. అయోధ్య రామాలయం బిజెపి కట్టిందా, ట్రస్ట్ కట్టింది, ఆలయ నిర్మాణానికి నేను కూడా 2 లక్షలు ఇచ్చానని తెలిపారు.
Read also: KTR: కేటీఆర్ పై టమాటాలతో దాడి.. 23 మంది పై కేసు నమోదు..
నిన్న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది, 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడుగుతే ఐదు నెలల 12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడని అన్నారు. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు, బండి సంజయ్ కి ఓటు వేస్తే అంత ఉత్తది అయిపోతుందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అది గెలిచే ప్రసక్తే లేదన్నారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ నోట్ల కట్టలు.. రంగంలోకి ఐటీ శాఖ