KTR: నిర్మల్ జిల్లా భైంసాలో నిన్న కేటీఆర్ రోడ్ షో లో కేటీఆర్ పై టమాటాల దాడి కేసులో 23 మందిపై కేసులు నమోదయ్యారు. అందులో 17 మంది హనుమాన్ దీక్ష పరులు ఉండటం గమనార్హం. 23 మందిపై 307,120 B, 143 ,144,147, 148R/W 149 IPC సెక్షన్ ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా.. నిన్న నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు.
Read also: Gold Price Today: ‘అక్షయ తృతీయ’ వేళ మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు మధ్య తోపులాట జరిగింది. సభ స్థలం వద్దకు రాకుండా హనుమాన్ దీక్ష స్వాములను తాళ్లతో బారికేడ్లతో నిర్బంధించారు. కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ ప్రసంగిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చే సమయాన అవతల వైపు నుండి స్వాములు జైశ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వగా ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న కేటీఆర్ పై కొందరు టమాటాలు, ఉల్లిగడ్డలు, వంకాయల తో దాడి చేశారు. మీటింగ్ లో ఉన్న పక్క వారిపై అవి పడడడంతో రాముడు ఇలానే ఇతరులపై దాడి చేయమన్నాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించాడు. భారీ బందోబస్తుతో పోలీసులు స్వాములను బీఆర్ఎస్ కార్యక్రర్తలను చెదరగొట్టారు. ప్రసంగం ముగిసిన వెంటనే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Amritpal singh: ఎంపీగా పోటీ చేయనున్న ఖలిస్థానీ ఉగ్రవాది.. తాత్కాలిక బెయిల్ కోసం కోర్టుకు..!