Harish Rao : రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ కల్లాలకు రారా.?
- ధాన్యం కొనుగోళ్లలో అవ్యవస్థలపై హరీష్ రావు ఫైర్
- మిల్లర్ల దోపిడీ.. రైతుల ఆవేదన వెల్లడి
- సీఎం ఢిల్లీ పర్యటనలపై ఘాటు వ్యాఖ్యలు
- సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆందోళన హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, రైతులు కల్లాల వద్దే కన్నీరు మున్నీరవుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ పేరుకుపోయిన ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను విన్న హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లుల వద్ద లారీలు అన్ లోడ్ కాక రోజుల తరబడి రైతులు వేచి చూడాల్సి వస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. తాలు, పచ్చ గింజ పేరుతో మిల్లర్లు వడ్లను తిరస్కరిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. “ధాన్యంలో 5 కిలోల తరుగు తీస్తున్న వారి తోలు తీయాలి” అని ఆయన హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు లేవని, వర్షం వస్తే ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ధ్వజమెత్తారు. వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లు కూడా అటకెక్కాయని, ప్రభుత్వం ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి 70 సార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ, ఒక్కసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల కష్టాలను చూడలేదు” అని ఎద్దేవా చేశారు. అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు రైతుల గోడు పట్టడం లేదని, తక్షణమే వారు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. JJL 24433 వంటి దొడ్డు రకాలు , KNM సన్న రకాలను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని సూచించారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని హరీష్ రావు విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ రావడం లేదని, రైతు భరోసా ఇప్పటికీ అందరికీ అందలేదని, పంట బీమా ఊసే లేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే, బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!