Harish Rao : అసెంబ్లీ వారం రోజులు కూడా నడవదు
- అసెంబ్లీ షెడ్యూల్‌పై హరీష్ రావు విమర్శలు
- పండుగలతో పనిదినాలు తగ్గాయని ఆరోపణ
- బడ్జెట్ చర్చకు సమయం సరిపోదన్న అభిప్రాయం
- ఆదివారం సభకు తమకు అభ్యంతరం లేదన్న హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌లో పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ప్రజా సమస్యలపై చర్చను నీరుగార్చడమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి సభ నడిచేది వారం రోజులు కూడా ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు. సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండుగలతో పాటు రెండు ఆదివారాలు వస్తున్నాయని, ఆ ఐదు సెలవు దినాలను మినహాయిస్తే చర్చకు చాలా తక్కువ సమయం మిగులుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
Also Read
సమావేశాల అజెండాపై క్లారిటీ ఇస్తూ, మార్చి 17 , 18 తేదీలలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత మార్చి 20వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని ఆయన వెల్లడించారు. అయితే, బడ్జెట్ వంటి కీలక అంశంపై సమగ్రంగా చర్చించే అవకాశం లేకుండా ప్రభుత్వం షెడ్యూల్‌ను కుదించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సెలవుల వల్ల తగ్గిన పనిదినాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మార్చి 29వ తేదీ ఆదివారం నాడు కూడా సభను నిర్వహించాలని భావిస్తోంది.
Bengal Elections: మమతా సర్కారుకు షాక్.. సీఎస్, డీజీపీల ట్రాన్స్‌ఫర్..
దీనిపై స్పందించిన హరీష్ రావు, ఆదివారం నాడు సభ పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమకు కావాల్సింది కేవలం చర్చకు తగిన సమయం మాత్రమేనని, ప్రజల పక్షాన గళం వినిపించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవాలని చూస్తోందని, దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్‌గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?