Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- గోదావరి-నల్లమల అనుసంధానంపై హరీష్ రావు అభ్యంతరం
- చంద్రబాబును సంతోషపెట్టడానికే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు?
- పోలవరం నుంచి నేరుగా కావేరికి నీరు తరలించే కొత్త ప్రణాళికపై విమర్శలు
- తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోల్పోయే ప్రమాదమంటూ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి నది అనుసంధాన ప్రక్రియలో తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నదుల అనుసంధానం
గోదావరి-నల్లమల సాగర్ , పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధాన ప్రతిపాదనలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధమైన అనుసంధానం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు లాంటిదని, ఇది ముమ్మాటికీ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహమేనని ఆయన దుయ్యబట్టారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరలేపిందని, ఈ వ్యూహాల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
చంద్రబాబును సంతోషపెట్టడానికేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంతోషపెట్టడానికి, ఆయనపై ఉన్న కృతజ్ఞతతో ‘గురుదక్షిణ’ చెల్లించుకోవడానికి రాష్ట్ర హితాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. స్వరాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి, తెలంగాణను నట్టేట ముంచేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో ఉన్న ప్రాజెక్టుల రూపకల్పనను గుర్తు చేస్తూ, అప్పట్లో ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని తరలించేలా ప్రతిపాదనలు ఉండేవని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక ప్రభుత్వాలు కూడా అంగీకరించాయని ఆయన గుర్తు చేశారు.
అయితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భూభాగాన్ని పూర్తిగా దాటవేసి, పోలవరం నుంచి నేరుగా నల్లమల సాగర్‌కు, అక్కడి నుంచి కావేరి నదికి నీటిని తరలించేలా ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని వివరించారు. ఈ మార్పుల వల్ల తెలంగాణకు రావలసిన నీటి వాటా దక్కకుండా పోతుందని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?