MLC Polling: ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605.. 807 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
పురుష ఓటర్లు… 2 లక్షల 88 వేల 189, మహిళలు 1 లక్షా 75 వేల 645, ఇతరులు ఐదుగురు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో 1 లక్షా 66 వేల 448 మంది ఓటర్లు, 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 80,871 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 51,560 మంది, మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. వీరి కోసం 97 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 144 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34,176 మంది, మహిళా ఓటర్లు 17,321 మంది ఉన్నారు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
Read also: TSPSC Group 1: గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు..
వారి కోసం 71 పోలింగ్ కేంద్రాలు. 99 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 20,838 మంది, మహిళా ఓటర్లు 13,242 మంది ఉన్నారు. వీరి కోసం 37 పోలింగ్ కేంద్రాలు, 59 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఉన్నారు. 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండల కేంద్రాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల్లో 4659 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. EC మార్గదర్శకాల ప్రకారం 20 శాతం అదనపు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి.
Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
- Tags
- bjp
- BRS
- congress
- khammam
- MLC by-election
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!