Governor Tamilisai: లోక్‌సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకుల సమాచారం. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే దృష్టి సారించాయి. బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో బీజేపీ 10 సీట్లే లక్ష్యంగా పెట్టుకోగా.. దానికి తగ్గట్టుగానే నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇవాళ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తన ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని దక్షిణ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read also: CM YS Jagan: గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కలకలం సృష్టించిన ఫ్లెక్సీ!
కాగా.. తమిళిసై గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరో మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసైని నియమించింది. ఇక.. 2021 నుండి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె రాజ్యాంగ పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళిసై ఎంపీగా పోటీ చేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించే అవకాశం ఉంది. జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. బీజేపీ నుంచి ఎవరైనా నియమిస్తారా? లేక పార్టీలకు సంబంధం లేని రిటైర్డ్ అధికారులను, రిటైర్డ్ న్యాయమూర్తులను నియమిస్తారాద? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Liquor Sales : మూడు రోజుల్లో రూ.154కోట్ల మద్యం తాగేశారు.. ఇంత కరువేంట్రా బాబు