Yadagirigutta: యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ..
- యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది
- ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య-ఈఓ భాస్కరరావు
- మొదటిరోజు గిరి ప్రదక్షణలో అధిక సంఖ్యలో భక్తులు
- 5 వేల మందితో గిరి ప్రదక్షిణ నిర్వహణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadagirigutta: యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు ప్రారంభించారు. మొదటిరోజు గిరి ప్రదక్షణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నేడు 5 వేల మందితో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ ఈఓ భాస్కర్‌రావు, వివిధ శాఖల అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం నుంచి వైకుంఠద్వారం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమై ముగియనుంది. అరుణాచలం, సింహాచలం ఆలయాల తరహాలో యాదాద్రి ఆలయంలో కూడా గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ భాస్కర్‌రావు వెల్లడించారు.
Read also: Pooja Hegde : టాలీవుడ్ నాకెంతో ప్రత్యేకం..
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. అనాదిగా వస్తున్న గిరిప్రదక్షిణను భక్తులు విశేష సంఖ్యల్లో చేసుకోవాలని ఉద్దేశంతో స్వామి వారి దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్డును భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు చేసేవారు కాకుండా.. గిరిప్రదక్షిణలో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమంను నిర్వహించారు. కాగా.. వేల సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. కాగా.. 2016లో ఆలయ పునర్నిర్మాణానికి ముందు భక్తులు గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునేవారు. ప్రస్తుతం యాదగిరిగుట్టపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా భక్తుల కోరిక మేరకు గిరి ప్రదక్షిణను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన స్వాతి నక్షత్రమైన ఈరోజు సుమారు 5 వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణను అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
Lockie Ferguson Record: ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన.. 4 ఓవర్లు, 4 మెయిడెన్లు, 3 వికెట్లు!
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!