Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal Ambulance: ముంబై నగరంలో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న లేదా నిరాశ్రయ స్థితిలో ఉన్న చిన్న జంతువులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బైక్ అంబులెన్స్ సేవ ప్రారంభమైంది. “జీవ్వన్ లైఫ్‌లైన్” (JeevOne Lifeline) పేరుతో రూపొందించిన ఈ వినూత్న సేవ ట్రాఫిక్ రద్దీని అధిగమిస్తూ జంతువులను వేగంగా వెటర్నరీ ఆస్పత్రులకు తరలించేందుకు ఉపయోగపడనుంది.
జీవ్వన్ అనే జంతు సంక్షేమ సంస్థ, యువసేన యానిమల్ వెల్ఫేర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ అంబులెన్స్ సేవను బుధవారం ప్రారంభించాయి. గాయపడిన, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న, ఇంకా వదిలివేయబడిన లేదా ప్రమాదంలో ఉన్న జంతువులకు సకాలంలో తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. జీవ్వన్ వ్యవస్థాపకుడు, జంతు సంక్షేమ కార్యకర్త సంకేత్ భట్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జంతు రక్షణ చర్యలు పెరుగుతున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఫీడర్లు, రెస్క్యూ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఈ సమస్యను తరచూ ఎదుర్కొంటున్నారని తెలిపారు.
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
దాదాపు ఆరు నెలల పాటు ప్రణాళికలు రూపొందించిన అనంతరం “జీవ్వన్ లైఫ్‌లైన్”ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదే కావడంతో జంతువులకు వేగంగా సహాయం అందించడమే ఈ సేవ లక్ష్యమని చెప్పారు. మొదటి EV బైక్ అంబులెన్స్‌ను థానేలో యువసేన అధ్యక్షుడు పుర్వేష్ సర్ణాయక్ అధికారికంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 EV బైక్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టనున్నారు.
ఈ ప్రయోగాత్మక దశలో సేవల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, స్పందన వ్యవస్థను మరింత మెరుగుపరచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మహారాష్ట్ర అంతటా.. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మోడల్‌ను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. నగర ప్రాంతాల్లో జంతు రక్షణ చర్యలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బైక్ అంబులెన్స్ సేవ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, తక్కువ ఖర్చుతో రవాణా, వెటర్నరీ సేవలకు సులభమైన ప్రాప్యత, సాంకేతిక ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, జంతు సంక్షేమ కార్యకర్తలకు మెరుగైన సహకారం లభించనుంది.
“సమస్యల గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా వాటికి పరిష్కారాలు కనుగొనాలని నేను నిర్ణయించుకున్నాను. అత్యవసర జంతు సంరక్షణలో రవాణా ఒక ప్రధాన సవాలు. జంతువు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు సత్వర సహాయం అందించాలనే ఉద్దేశంతోనే జీవ్వన్ లైఫ్‌లైన్‌ను ప్రారంభించాం” అని సంకేత్ భట్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జంతు అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి కార్పొరేట్ సంస్థలు, CSR భాగస్వాములు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. వారి సహకారంతో దేశవ్యాప్తంగా జంతు అంబులెన్స్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
🚑🐾 More than an ambulance. A scalable solution for animal welfare. In this video, we take you through the features, design, and vision behind JeevOne Lifeline, India's First EV Bike Ambulance Service for Animals. Built to navigate congested city roads, reduce response pic.twitter.com/aIpybETcmx
— sanket bhatt (@imsank) June 24, 2026
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!