జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న బల్దియా జనరల్ బాడీ మీటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. అయితే..ఈ కౌన్సిల్ మీటింగ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయితే.. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుల గొడవకు దిగారు. దీంతో.. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సర్ది చెప్పె ప్రయత్నం చేశారు. దీంతో.. సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సభను అడ్డుకునే బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నం చేస్తుంటే.. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ వారిస్తున్నారు. మేయర్ పొడియంని చుట్టుముట్టి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు నిరసనలు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీట్ లోకి మార్షల్స్ ని పిలిచారు మేయర్. అయితే.. మేయర్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యుల నినాదాలు చేశారు. సభ్యులను వారిచెందుకు మేయర్ చైర్ దగ్గరకు చేరుకున్న ఓఎస్డీ.. చెప్పినా వినకపోవడంతో వెనుదిరిగారు ఓఎస్డీ. అయితే.. 2022-23 బడ్జెట్‌ని జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదించింది.
Also Read : YSR Ghat: ఇడుపులపాయలో వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం
అయితే.. ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ ఆమోదం జరిగిందని మేయర్ ప్రకటన చేశారు. మొత్తం 6224 కోట్లు బడ్జెట్ ఆమోదం తెలిపింది కౌన్సిల్. దీంతో.. డౌన్ డౌన్ మేయర్ అంటూ బీజేపీ కార్పొరేటర్స్ నినాదాలు చేశారు. అజెండా జరిగిన రోజునే మీకు సవరణలు ఉంటే ఆరోజే చెప్పాల్సిందని మేయర్ వ్యాఖ్యానించారు. అనంతరం.. ముగ్గురు సభ్యలతో ఛాంబర్ కు రండి అంటూ మేయర్ ప్రతిపాదించి.. సభను 10 నిమిషాలు వాయిదా వేశారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. అయితే.. అనంతరం 10 నిమిషాల తరువాత తిరిగి కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. సభలో బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాలు కొనసాగుతున్నాయి. కార్పొరేటర్ల పట్ల ఎమ్మెల్యే లు పెత్తనం చేస్తున్నారని సభ్యుల నినాదాలు చేస్తూ.. మేయర్ పోడియం నుంచి బీజేపీ కార్పొరేటర్లు ముందుకు కదలలేదు. ఓ వైపు మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేస్తుంటే.. మరొ పక్క మోడీ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. దీంతో.. బీజేపీ కౌన్సిలర్స్ పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు వారి స్థానంలోకి వెళ్ళక పోతే సభను వాయిదా వేస్తా అంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మేయర్ కు బీజేపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.