నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వింత వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో హాలిడే అంటూ ప్రకటన వెలువడింది. ఇవ్వాళ ఉదయాన్నే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పేరుతో ఓపీ వైద్య సేవలకు సెలవు అని ప్రకటన విడుదలైంది. ఇది ప్రకటించిన కొన్ని గంటలకు మరోసారి ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథాతథం అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రోగులతో పాటు, వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇటువంటి ప్రకటనల వల్ల…
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి.…
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో.. జీహెచ్‌ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ ఏడాది నిమజ్జనాలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపట్టనుంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది.…