హైదరాబాద్‌లో టూ లెట్ బోర్డు పెట్టినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) జరిమానా విధిస్తుందంటూ ఓ వార్త హల్ చల్ చేసింది.. ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు జరిమానా విధించడంతో ఓ ప్రచారం మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది జీహెచ్‌ఎంసీ.. సొంత ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టినా ఫైన్ అని వచ్చిన వార్తలను ఖండించింది.. కేవలం కమర్షియల్ బిజినెస్ ఏజెంట్స్, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్స్ వాళ్లు పబ్లిక్ ప్రదేశాల్లో అంటిస్తున్న పోస్టర్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది.. వ్యక్తిగతంగా ఎవరి ఇంటికి వారు పెట్టుకునే టూ లెట్ బోర్డులకు ఫైన్ లేదని స్పష్టం చేసింది. కాగా, పబ్లిక్ ప్రదేశాల్లో టూ లెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్ కార్డు చేస్తాం అంటూ వెలిసిన కొన్ని ప్రచార పోస్టర్లకు జరిమానా విధించింది జీహెచ్‌ఎంసీ.. కానీ, వ్యక్తిగతంగా ఇంటికి పెట్టిన టూ లెట్ బోర్డుకు ఫైన్ విధిస్తే తమ దృష్టికి తేవాలని వాటిని సరిదిద్దుతామని చెబుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.