Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Gangaputru Who Met Bandi Sanjay

Praja Sangrama Yatra: బండి సంజయ్ ను కలిసిన గంగపుత్రులు.. జీవో 6ను రద్దు చేయాలని వినతి

Published Date :September 20, 2022 , 2:01 pm
By NTV WebDesk
Praja Sangrama Yatra: బండి సంజయ్ ను కలిసిన గంగపుత్రులు.. జీవో 6ను రద్దు చేయాలని వినతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Praja Sangrama Yatra: మౌలాలిలోని మనీషా గార్డెన్స్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. గంగపుత్రులు కలిసారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. కులవృత్తులను కేసీఆఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 6 ను తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6 ను వెంటనే రద్దు చేయాలని వినితి పత్రంలో పేర్కొన్నారు. చేపలు పట్టే వృత్తి గంగపుత్రులకే హక్కుగా ఉండాలని డిమాండ్‌ చేశారు. గంగపుత్రులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కోరారు. గంగపుత్రుల హక్కులు కాలరాస్తూ ఇతరులకు మా కులవృత్తిని దాసోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర కులస్తుల నుండి రక్షణ కొరకు ఒక ప్రత్యేక గంగపుత్ర చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు.

వాజ్ పేయి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఎస్టీ జాబితాలో గంగపుత్రులను చేర్చాలని బండి సంజయ్ తో విన్నవించారు. దీంతో స్పందించిన బండి సంజయ్‌ మీ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని తెలిపారు. అన్ని కులాలు, అన్ని వర్గాలలోని అర్హులకు బీజేపీ తప్పక న్యాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు.

నిన్న టీఆర్ఎస్ నేతల్ని డంపింగ్ యార్డ్ వద్దే కట్టేయాలని.. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్.. మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్‌కు రావాలి’ అంటూ సవాల్ విసిరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కేసీఆర్ తనఖా పెట్టారని ఆరోపించిన బండి సంజయ్.. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. భూకబ్జాలతో టీఆర్ఎస్ నేతలు కోట్లు దండుకున్నారని విమర్శించిన విసయం తెలిసిందే.
Praja Sangrama Yatra: బండి సంజయ్ ను కలిసిన గంగపుత్రులు.. జీవో నెంబర్ 6ను రద్దు చేయాలని వినతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • Ganga Putra
  • manisha garden moulali
  • Praja Sangrama Yatra

తాజావార్తలు

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions