Munugode by-election: మునుగోడు బరిలో గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు కేఏ పాల్ అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నంత పని చేశాడు.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో తమ పార్టీని అభ్యర్థిని పోటీకి పెట్టబోతున్నారు.. మునుగోడు ఉపఎన్నిలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన ప్రజాగాయకుడు గద్దర్ పేరును ప్రకటించారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గద్దర్.. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని ప్రకటించారు.. ఇక, ఆమరణ దీక్ష విరమించారు పాల్… గద్దర్ తనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్ 2న పీస్ మీటింగ్ కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ కేఏ పాల్ ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే, గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. ఈ మధ్య పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటూ.. అటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్.. ఇలా అన్ని పార్టీల నేతలను కలిసి ఆయన మద్దతు కోరిన విషయం తెలిసిందే..
Read Also: KCR National Party: అప్పుడు కౌరవులపై పాండవుల విజయం.. ఇప్పుడు బీజేపీపై కేసీఆర్ విజయం..!
Also Read
- Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Hyderabad: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
కాంగ్రెస్ కంటే ఈ మధ్య గద్దర బీజేపీతో సన్నిహితంగా మెలిగారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలవడం ఒక ఎత్తు అయితే… బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్న ఆ సభకు గద్దర్ కూడా హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. ప్రజా సమస్యలపై పాటలు పాడుతూ.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వచ్చిన గద్దర్.. బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది.. ఎర్రగులాబీ కలర్ మారుతుందనే కథనాలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆగా, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.. ఇక, సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ తన శక్తినంతా ఒడ్డుతుంది.. ఇప్పటికే తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించి ప్రజల్లోకి వెళ్తోంది.. మరోవైపు.. మునుగోడుపై గురిపెట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోయినా.. ప్రచారంలో దూసుకుపోతోంది.. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కేఏ పాల్. రూ. 25 వేల కోట్ల బిజినెస్ ఇస్తామని బీజేపీ (పెద్దలు ఆఫర్ చేయడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు అన్ని పార్టీల పనితీరు చూశారని, ఈ సారి తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరునెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14తో నామినేషన్ల గడువు ముగియనున్నది. నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా 6న ఓట్లను లెక్కించనున్నారు.
తాజావార్తలు
-
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
-
Peddi: సెకండ్ వీకెండ్లోనూ తగ్గని జోరు.. బుక్‌మైషోలో రికార్డుల వేట!
-
US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
-
West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
-
SpaceX IPO: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా భారత టెక్కీలు! మస్క్ ‘స్పేస్ఎక్స్’ తెస్తున్న లక్ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!