Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumbudi Trailer: మాస్ మహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సినిమాల తర్వాత ఇప్పుడు ఆయన పూర్తిగా భిన్నమైన కథతో ‘ఇరుముడి’ తో వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, నిన్న విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్, ఎమోషన్స్, ఆధ్యాత్మికతతో పాటు సోషల్ ఎలిమెంట్స్ ను కూడా ఆసక్తికరంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాలో ఆయన సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలకమైన కూతురు పాత్రను పోషిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక విజయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమేష్ ఇందిర మరియు కిషోర్ కుమార్ పొలిమేర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, జి. వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
నిన్న రిలీజ్ అయిన ‘ఇరుముడి’ ట్రైలర్ లో రవితేజ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. భార్య, కుమార్తెతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఆయన తన కూతురు మనేమ్మ కోరుకున్న ప్రతిదీ అందించేందుకు కష్టపడుతుంటారు. బేబీ నక్షత్ర ఈ పాత్రలో రవితేజ కుమార్తెగా నటించింది. తండ్రి, కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ట్రైలర్లో భావోద్వేగంగా చూపించారు. రవితేజ ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా కనిపిస్తూ, ఈ తండ్రి పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకుంటున్నారు.
అయితే కథ కేవలం కుటుంబ భావోద్వేగాల చుట్టూ తిరగదు. గ్రామంలో వరుసగా యువతులు రహస్యంగా హత్యకు గురవుతుండటంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. గ్రామంలోని ప్రతి అమ్మాయిని తన కుటుంబ సభ్యురాలిగా భావించే రవితేజ పాత్ర, ఈ ఘటనలతో మరింత ఆందోళనకు గురవుతుంది. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల వెనుక ఉన్న కారణం ఏమిటి? పాఠశాలల చుట్టూ జరుగుతున్న కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలే కథలో ప్రధాన ఉత్కంఠకు కారణంగా కనిపిస్తున్నాయి.
రవితేజ పాత్రలో మరో ఆసక్తికరమైన కోణాన్ని కూడా ట్రైలర్ పరిచయం చేసింది. ఆయనకు మద్యం అలవాటు అతిపెద్ద బలహీనతగా చూపించారు. ఈ అలవాటు కారణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అదే సమయంలో ఆయన ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు పూర్తిగా మారిపోయి క్రమశిక్షణతో ఉండే వ్యక్తిగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ పాత్రే అభిమానులను ఆకట్టుకోబోయేలా కనిపిస్తోంది.
దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటివరకు ప్రేమ, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకున్న కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి చిత్రాల తర్వాత ‘ఇరుముడి’తో ఆయన ఈ కొత్త జానర్‌ను తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ రవితేజ భార్యగా నటిస్తున్నారు. బేబీ నక్షత్ర మధ్య బంధం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. గురుస్వామి పాత్రలో సాయి కుమార్ కనిపించగా, ఈ ట్రైలర్ కు మాత్రం విశేష స్పందన లభిస్తోంది.
నిన్న భీమవరంలో నిర్వహించిన కార్యక్రమం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. రవితేజ తన భీమవరం జ్ఞాపకాలను, అక్కడ సినిమాలు చూసిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై కేరింతలు, చప్పట్లతో సందడి చేశారు. నిర్మాత మైత్రి రవి కూడా ‘ఇరుముడి’పై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
మొత్తంగా చూస్తే, ‘ఇరుముడి’ ట్రైలర్ రవితేజను కేవలం మాస్ హీరోగా కాకుండా కుటుంబానికి అంకితమైన తండ్రిగా, తన బలహీనతలతో పోరాడే వ్యక్తిగా, అవసరమైనప్పుడు యాక్షన్‌కు దిగే పాత్రలో చూపిస్తోంది. సామాజిక సమస్యకు ఆధ్యాత్మికతను జోడించి శివ నిర్వాణ రూపొందించిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కనిపిస్తోంది. ట్రైలర్‌కు వచ్చిన సానుకూల స్పందన, భీమవరం ఈవెంట్‌కు లభించిన ఆదరణతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 21న ‘ఇరుముడి’ థియేటర్లలోకి వచ్చినప్పుడు రవితేజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!