Flexi War: నిజామాబాద్ జిల్లాలో BJP, BRS మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తూ నగరంలో హల్చల్ సృష్టిస్తున్నాయి. శుక్రవారం రోజున బీజేపీ ఎంపీ అర్వింద్ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇవాళ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా హోర్డింగులు దర్శనమిచ్చాయి. నిరుద్యోగ భృతి, ఎన్ఆర్డీఐ సెల్, రెండు పడక గదుల ఇళ్లపై బీఆర్ఎస్..ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిగో నిరుద్యోగ భృతి, సీఎం మాట ఇస్తే తల నరుక్కుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పుడు అంటూ ఫ్లెక్సీల్లో రూ.3016 వచ్చేలా నోట్లను ముద్రించి నిరుద్యోగ భృతిపై వ్యంగ్యంగా రాశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మేల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు నిజామాబాద్ నగరంలో శుక్రవారం పసుపు రంగు ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి చోటా ఇవాళ పోటాపోటీ ఫ్లెక్సీలు ఉంచారు. నిన్నటి రోజున ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా బ్యానర్లు వెలసిన విషయం తెలిసిందే. అయితే.. పసుపు బోర్డు ఏర్పాటు చేసి.. ఇది మా ఎంపీ తీసుకొచ్చిన పసుపు బోర్డు అంటూ పసుపు రంగు బోర్డులు నగరంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. అయితే.. దీనిపై అర్వింద్ స్పందిస్తూ పసుపు బోర్డుపై కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని, బీఆర్ఎస్ ను కూడా తాము ప్రశ్నిస్తామని చెప్పారు. అలాచెప్పిన అర్విద్ 24 గంటలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా హోర్డింగులు వెలియడంతో ప్రస్తుతం ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read also: Nani: స్టార్ హీరోలందరి రికార్డ్స్ బద్దలయ్యాయి… మిగిలింది మహేశ్ బాబు ఒక్కడే
జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో ఫ్లెక్సీల కలకలం రేపాయి. జగిత్యాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్న నేపథ్యంలో.. ప్రభుత్వం పనితీరుకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు వెలసాయి. డబుల్ బెడ్ రూమ్ కట్టివ్వడంలో, నిజాం చెక్కర కర్మాగారం తెరిపించడంలో విఫలమైoదని సూచిస్తూ వెలసిన ఫ్లెక్సీలు వెలసాయి. కేసీఆర్ ,కేటీఆర్ తో కవిత సెల్ఫీలు దిగిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారు. విషయం తెలిసిన వెంటనే ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
జిల్లాలో రాత్రికి రాత్రే వెలుస్తున్న ప్లెక్సీలు, హోర్డింగులతో రాష్ట్రప్రజలు అయోమయంలో పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ఏంజరుగుతుంది? అని ప్రశ్నించుకుంటున్నారు. ఒకరోజు బీజేపీ ప్లెక్సీలు వెలిస్తే ఆ మరుసటి రోజే బీఆర్‌ఎస్ ప్లెక్సీలు వెలుస్తున్నాయి. దీంతో జిల్లాలో ప్రజలు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరు ఇలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు. విమర్శలు ప్రతి విమర్శులు చేసుకుంటున్నా రాజకీయ నాయకులపై మండిపడుతున్నారు. ఈ ప్లెక్సీలు, హోర్డింగ్ లు ఏంటని.. ఏంటీ మాకీ రచ్చ అంటూ మండిపడుతున్నారు. ప్రజలు వారి సమస్యలను నాయకులకు చెప్పుకుంటే తీర్చేదిపోయి ఒకరినొకరు విమర్శలు ప్రతి విమర్శాల అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఈ ప్లెక్సీల వార్ షురూ అయ్యింది. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ముందుంది ముసల్ల పండుగ అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Priyanka Hugs Karan: కరణ్ జోహార్‌ను కౌగిలించుకున్న ప్రియాంక చోప్రా