Siddipet Accident: సిద్దపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని తిరిగివెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం బలయ్యింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కన పెద్ద గుంతలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘోరం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కారులో వెళ్లారు.
Read also: Web series: ‘అండర్ వరల్డ్ బిలియనీర్స్’లో అరవింద్ కృష్ణ!
దర్శనం అనంతరం తిరిగివెళుతుండగా జగదేవ్ పూర్ మండలం మునిగడప వద్ద కారు అదుపుతప్పి గుంతలో పడింది. వెంటనే స్థానికులు స్పందించి కారులోని వారిని కాపాడే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు, మరో మహిళ మృతిచెందింది. మరొకరు తీవ్ర గాయాలపాలవగా వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును గుంతలోంచి బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దుర్ఘటనపై మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతి చెందిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతన్న మరొకరి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
CM Jagan: ఎటువంటి గ్యారంటీ లేకుండా సున్నా వడ్డీతో రుణాలిస్తున్నాం