Terrible incident: తండ్రి కిరాతకం.. కూతురిపై గొడ్డలితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి తన కూతురిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన గుండ్ల సదానందం తన 11 ఏళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు. చిన్నారిని చంపిన తర్వాత అదే గొడ్డలితో మరో వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. గొడ్డలితో తిరుగుతున్న సదానందను చూసి ప్రజలు పరుగులు పెట్టారు. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై తిరుగుతూ వున్నసదానందను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Microsoft: నో ‘శాలరీ హైక్’.. బోనస్ బడ్జెట్‌లోనూ కోత?!
Also Read
- Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
అయితే నిందితుడు సదానందను పోలీసు వాహనంలో తీసుకు వెళుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సదానందను తీసుకుని వెళ్లకూడదంటూ పోలీసులను కదలనివ్వలేదు. నిందితుడు సదానందను తామే శిక్షిస్తామంటూ స్థానికులు పోలీసుల వాహనాన్ని ముళ్ల తీగతో అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. గ్రామస్తులను చెదరగొట్టేందుకు ప్రయత్నించయగా.. పోలీసు వాహనంపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే సదానందం తన కూతురిని ఎందుకు ఇంత కిరాతకంగా చంపాడో తెలియాల్సి ఉంది. గతంలో నేరచరిత్ర ఉన్న సదానంద తన కూతురిపై ఎందుకు ఇలా గొడ్డలితో దాడి చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఉన్మాది కావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Errabelli Dayakar: జేపీఎస్‌లను మేము చర్చలకు పిలువలేదు.. ఎర్రబెల్లి క్లారిటీ
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!