Terrible incident: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి తన కూతురిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన గుండ్ల సదానందం తన 11 ఏళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు. చిన్నారిని చంపిన తర్వాత అదే గొడ్డలితో మరో వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. గొడ్డలితో తిరుగుతున్న సదానందను చూసి ప్రజలు పరుగులు పెట్టారు. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై తిరుగుతూ వున్నసదానందను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Microsoft: నో ‘శాలరీ హైక్’.. బోనస్ బడ్జెట్‌లోనూ కోత?!
అయితే నిందితుడు సదానందను పోలీసు వాహనంలో తీసుకు వెళుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సదానందను తీసుకుని వెళ్లకూడదంటూ పోలీసులను కదలనివ్వలేదు. నిందితుడు సదానందను తామే శిక్షిస్తామంటూ స్థానికులు పోలీసుల వాహనాన్ని ముళ్ల తీగతో అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. గ్రామస్తులను చెదరగొట్టేందుకు ప్రయత్నించయగా.. పోలీసు వాహనంపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే సదానందం తన కూతురిని ఎందుకు ఇంత కిరాతకంగా చంపాడో తెలియాల్సి ఉంది. గతంలో నేరచరిత్ర ఉన్న సదానంద తన కూతురిపై ఎందుకు ఇలా గొడ్డలితో దాడి చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఉన్మాది కావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Errabelli Dayakar: జేపీఎస్‌లను మేము చర్చలకు పిలువలేదు.. ఎర్రబెల్లి క్లారిటీ