Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కన్నెర్న చేశారు. రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేసేవారు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ధర్నా చేపట్టారు. కల్లాల్లో ధాన్యం పోసి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని రైతుల హెచ్చరించారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిందని ధాన్యం కొలుగోలుకు ఎవరు ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు.
Read also: Swathi : స్వాతి మలివాల్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడంపై వెల్లువెత్తున్న అనుమానాలు
ఇలా అయితే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు తడిస్తున్నాయని, తడిసిన పంటలను కూడా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తానని చెబుతున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. కల్లాల్లో ధాన్యం రెండు నెలల నుంచి వుందని, పట్టించుకునే నాధుడే కరువయ్యాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పిన ఎవరు స్పందించడం లేదని, ప్రభుత్వం నుంచి సమాచారం లేదంటూ తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. అప్పులు చేసి పంటలు పండించామని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పంచాలని కోరుతున్నారు. రైతులపై ప్రభుత్వం ఎలా ఉండబోతుందున్నది ప్రశ్నార్థకంగా మారింది.
Read alsg: Fair Accident: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫుట్ వేర్ షాప్..
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మార్కెట్ యార్డు వద్ద తేమ ఎక్కువగా ఉందని జొన్నలను కొనుచేయకుండా అధికారులు ఆపేశారు. అంతేకాకుండా.. రైతుల వాహానాలను గేటు బయటే ఉంచారు. ఉదయం నుంచి గేటు ముందు వాహానాలతో రైతుల పడిగాపులు కాస్తున్నా అధికారులు స్పందన లేకపోవడం గమనార్హం. అయితే ఒకవైపు రైతుల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం కొనుగోలు చేయకుండా ఉంచడం రైతుల సహనానికి పరీక్షగా మరింది.
Vaccine Side Effects : కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత శరీరం పనిచేయడం లేదు.. మహిళ కేసు నమోదు