Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కన్నెర్న చేశారు. రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేసేవారు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ధర్నా చేపట్టారు.
నూతన సంవత్సరం తొలి రోజే ఆ రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నెల రోజులుగా ఆరబోసిన ధాన్యాన్ని కాంటా వేయడం లేదనీ, అప్పు ఇచ్చిన వ్యక్తుల వద్ద పరువు పోతోందన్న వేదనతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రామటెంకి సందీప్ పండించిన ధాన్యాన్ని నెల రోజుల కిందట గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబోశాడు.…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.…
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.ఇన్ని రోజులు ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనేవారు లేక ఇంట్లోనే ధాన్యం పేరుకుపోయిన పరిస్థితి. ఈ తరుణంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మద్దతు ధర ప్రకారమే…