కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో ఓ రైతు ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలాడు. లింగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం అవుతున్నాయి.
దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మానసిక వత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతు బీరయ్య వుండిపోయాడు. దీంతో మానసిక వత్తిడి ఎక్కువయింది. దీనికి తోడు రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్ళు ఆలస్యం కావడంతో రైతు ఆందోళనకు గురై గుండెపోటుకి గురయ్యాడు. దీంతో రైతు కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.