తాము అండగా ఉంటామంటూ మృతిచెందిన రైతు కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య.. 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే.. ఇక, వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య…
కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో ఓ రైతు ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలాడు. లింగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం అవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మానసిక వత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతు బీరయ్య వుండిపోయాడు. దీంతో మానసిక వత్తిడి ఎక్కువయింది. దీనికి తోడు రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్ళు ఆలస్యం…