Fake Baba: విక్రమార్కుడు సీన్ రిపీట్.. నరదిష్టి ఉందని నగలు కాజేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba Caught By Hyderabad Police Who Stolen Mangalasutra:విక్రమార్కుడు సినిమాలో మాస్ మహారాజా రవితేజ దొంగ బాబా వేషం వేసుకొని, మహిళలను మోసం చేసే సన్నివేశం గుర్తుందా? తిరుపతి మొక్కు ఒకటి మిగిలిపోయిందని, తన దగ్గరున్న తిరుపతి కత్తితో గుండు గీయించుకుంటే లక్షలకు లక్షలు డబ్బులొస్తాయని నమ్మించి.. అరగుండు కొట్టి వెళ్లిపోతాడు. ఇలా అరగుండ్లు కొట్టి.. రవితేజ, బ్రహ్మానందం బాగా క్యాష్ చేసుకుంటారు. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే రియాలిటీలో జరిగింది. కాకపోతే.. ఇక్కడ ఈ దొంగ బాబా అరగుండు కాన్సెప్ట్ తప్ప, మిగతాదంతా ఫాలో అయ్యాడు. నరదిష్టి ఉందని మాయమాలు చెప్పి.. ఓ మహిళకు మత్తుమందు ఇచ్చి.. నగలు కాజేశాడు. చివరికి పోలీసుల చేతికి అడ్డంగా చిక్కాడు.
Attack on Police: శామీర్ పేట్, అల్వాల్ పోలీసులపై దాడి.. బొమ్మలరామారంలో ఘటన
Also Read
- CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
ఆ వివరాల్లోకి వెళ్తే.. దొంగతనం చేయాలనే దురుద్దేశంతోనే దొంగ బాబా వేషం వేసిన ఓ వ్యక్తి, హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఇంద్రప్రస్థ కాలనీలో ఓ ఇంటిపై కన్నేశాడు. ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఆ ఇంటికి వెళ్లాడు. నరదిష్టి ఉందని మాయమాటలు చెప్పాడు. పాపం.. అతని మాటలు నమ్మిన ఆ మహిళ, అతడ్ని ఇంట్లోకి పిలిచింది. లోపలికి వెళ్లిన తర్వాత తాను శ్రీశైలం నుండి వచ్చానని కథలు అల్లాడు. ఈ క్రమంలోనే తనతో పాటు తెచ్చిన మత్తుమందుని ఆమెపై చల్లాడు. ఆమె మత్తులోకి జారుకొని కింద పడిపోగానే.. మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లాడు. మత్తు నుంచి కోలుకున్న తర్వాత తన మెడలో మంగళసూత్రం లేకపోవడాన్ని ఆ మహిళ గమనించింది. దీంతో ఆ దొంగ బాబా మోసం చేశాడని గ్రహించి, ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.
Rajinikanth: సీరియస్ వార్నింగ్.. రజినీకాంత్ పేరు వాడితే ఖబడ్దార్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అపార్ట్మెంట్కి ఉన్న సీసీటీవీ ఆధారంగా ఆ దొంగ బాబా ఎవరో గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నందనవనంలో ఉన్నాడని గుర్తించి, అక్కడ అతడ్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మంగళసూత్రం రికవరి చేసి, తిరిగి మహిళకు అప్పగించారు. ఆ బాబాని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!