Rajinikanth Issues Public Notice Over Infringement Of Rights: సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు తమ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడం కోసం.. సెలెబ్రిటీలను అంబాసిడర్‌లుగా నియమించుకుంటారు. అందుకు గాను వాళ్లను కొంత అమౌంట్ కూడా ఇస్తారు. కానీ.. హీరోలపై పెట్టుబడి పెట్టేంత స్థోమత లేని వారు మాత్రం.. దొంగచాటుగా హీరోల పేర్లనో, ఫోటోలనో, సినిమాల పోస్టర్లనో వాడుకుంటారు. వాటి ద్వారా జనాల్ని ఆకర్షించి, సొమ్ము చేసుకుంటారు. తన విషయంలో ఇలా జరుగుతుండటంతో.. సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫైర్ అయ్యారు. తన న్యాయవాది చేత ఒక సీరియస్ వార్నింగ్ ఇప్పించారు. రజనీకాంత్ పేరు, ఫొటో, మాటలు లేదా ఆయనకు సంబంధించిన ఏ ప్రత్యేకతలనైనా వినియోగిస్తే.. అది వ్యక్తిత్వం, సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘించినట్టు అవుతుందందన్నారు. అలా చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రజినీ తరఫు న్యాయవాది ఎస్ ఎలంభారతి పబ్లిక్ నోటీసు విడుదల చేశారు.
Female Guise: ట్రెండ్ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు
‘‘సూపర్‌స్టార్ రజినీకాంత్ ఒక సెలెబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి. వాణిజ్య పరంగా రజనీకాంత్ వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫొటోలను ఉపయోగించే హక్కులపై కేవలం ఆయనకు మాత్రమే నియంత్రణ ఉంది. అయితే.. కొన్ని వేదికలు, మాధ్యమాలు, ఉత్పత్తుల తయారీదారులు మాత్రం రజినీకాంత్ అనుమతి లేకుండానే ఆయన పేరు, మాటలు, ఫొటోగ్రాఫ్, వ్యంగ్య చిత్రాలు, నటనకు సంబంధించిన పోస్టర్లను దుర్వినియోగం చేస్తున్నారు. దీని ద్వారా వాళ్లు వినియోగదారుల్ని ఆకర్షించి, తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా లేదా తమ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చేలా చర్యలకు పాల్పడుతున్నాయి. రజినీకాంత్ ఒక గొప్ప నటుడితో పాటు మానవతావాది కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను లక్షలాది మంది సూపర్ స్టార్‌గా పిలుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్న గౌరవం, అభిమానుల సంఖ్య సాటిలేనిది. ఆయనకున్న ప్రతిష్ఠ లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే.. అది రజినీకాంత్‌కు ఎంతో నష్టం’’ అని నోటీసులో ఎలంభారతి పేర్కొన్నారు.
Kotamreddy Sridhar Reddy: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు