Auto Drivers Begging: బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన చేస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించలేక పోతున్నామని వాపోతున్నారు. కుటుంబం గడవాలని ఆటోలు తీసుకుని బతుకుతున్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసిందని మండిపడుతున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పిన స్పందించలేదని వాపోతున్నారు. ఇళ్లు గడవాలంటే చాలా ఇబ్బందిగా మారిందని అందకే వినూత్నంగా భిక్షాటన చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆటోడ్రైవర్ల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. జీవనోపాధికి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆటోలు వేసిన అందులో ఒకరో ఇద్దరు ఎక్కడం వలను ఇబ్బందిగా తయారైందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ వస్తున్నా ఆటోవాలా ఇళ్లల్లో ఆనందం కరువైందని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పథకాలకు మేము పేర్లు పెట్టడం లేదని, ఆటోవాళ్ల బాధలను ప్రభుత్వం గుర్తించి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అందుకే ఈ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు.
Read also: ED Team: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ బృందంపై 300 మంది దాడి
తెలంగాణ ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబరు 9 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమపొట్టే విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఎక్కించకపోవడంతో రోజువారి ఆదాయం కోల్పోయామని.. కుటుంబాలను ఎలా పోషించుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇవాళ తెలంగా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తూ రేవంత్ సర్కార్ గుర్తించాలని కోరుతున్నారు. మరి సంక్రాంతి పండుగకు రేవంత్ సర్కార్ ఆటోడ్రైవర్లను ఆదుకుంటుందా? లేదో వేచి చూడాలి.
Jasprit Bumrah: తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా అరుదైన రికార్డు.. సచిన్‌కు సైతం సాధ్యం కాలే!