Facebook Love Story: ప్రేమకు ప్రాంతాలు, మతాలు అక్కర్లేదు. ప్రేమ.. ప్రేయసిని, ప్రియుడ్ని కలుసుకునేందుకు దేశాలు, విదేశాల నుంచైనా సరే వారి దగ్గరకు చేరుకుంటున్న రోజులివి. ముఖ పరిచయాలు వారికి అక్కర్లేదు. మొన్నటికి మొన్న ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిన ప్రియున్ని కలవడానికి పాకిస్తాన్ నుంచి ఇండియాకు బయలు దేరిని యువతిని అధికారులు అదుపులో తీసుకుని విచారించగా ఆమె వివరాలు వెల్లడించడంతో.. ఖంగు తిన్నారు. ఫేస్ బుక్ పరిచయం ఏర్పడిన ప్రియుడ్ని కలుసుకునేందుకు ప్రయాణిస్తున్నాను అనడంతో..ఆయువతికి వారి నచ్చచెప్పినా వినకుండా అతన్ని కలిసేంత వరకు ప్రయాణం కొనసాగిస్తా అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఇలాంటి ఘటనే మన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. వారిద్దరికి ఫేస్ బుక్ వివాహ వేదికైంది. పెద్దలను ఎదిరించి పెళ్లికూడా చేసుకున్నారు. కానీ.. చివరకు ప్రాణాలు వదిలారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని సఫిల్ గూడ లో వినాయక్ నగర్ కు చెందిన శ్రీకాంత్, రాజేంద్రనగర్ కు చెందిన నికితలకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు జూన్ 4 వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న నిఖిత పేరెంట్స్ ఇద్దరిని విడదీసారు. ఇది సరైంది కాదంటూ.. నిఖితను వారింటికి తీసుకుని వెళ్లిపోయారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన నిఖిత లోలోపలే కుమిలి పోయింది. చివరకు ఆగష్టు 15వ తేదిన ఆత్మహత్యకు పాల్పడింది. ఈవిషయం తెలుసుకున్న ప్రియుడు శ్రీకాంత్ నిఖిత లేని జీవితాన్ని ఊహించుకోలేక పోయాడు.తీవ్ర మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసున్నాడు.
ఈ విషయమై శ్రీకాంత్ సోదరి శిరీష ఎన్ టీవీతో మాట్లాడింది. నిఖిత పేరెంట్స్ చేయబట్టే తన తమ్ముడు శ్రీకాంత్ చనిపోయాడని ఆరోపించింది. వాళ్ళని విడదీయడం తోనే ఇద్దరు చనిపోయారని ఆవేదన చెందింది. వారిని అలానే వదిలేసి ఉంటే ఎక్కడో ఒక దగ్గర బతికి ఉండేవారని కన్నీరుపెట్టుకుంది. కులం పేరుతో ఇద్దరిని విడదీశారని, రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి నిఖిత, శ్రీకాంత్ లను విడదీశారని ఆరోపనలు చేసింది. రాజేంద్రనగర్ పోలీసులు వారికి న్యాయం చేయలేదని ఆరోపించింది. మా అమ్మకు నేను, మా తమ్ముడు ఇద్దరమే అంటూ కన్నీటిపర్వంతం అయ్యింది. తన భర్త రెండు నెలల క్రితమే చనిపోయాడని, ఇప్పుడు తన తమ్ముడు చనిపోయాడని, ఇప్పుడు వారి కుటుంబాన్ని దిక్కు లేకుండా చేశారని కన్నీమున్నీరయ్యారు.
Kothapalli Subbarayudu :ఆ మాజీ మంత్రికి కొత్త కష్టాలు తప్పడంలేదా..?